పుట:విక్రమార్కచరిత్రము.pdf/323

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

275


నెట్టుకొని యాఁడువారల
దిట్టతనం బెఱుఁగ బ్రహ్మదేవుని వశమే?

47


చ.

అనుచుఁ దదీయనైపుణగుణాళి విరాళిగొనంగఁ జెప్పఁగా
విని, యిటువంటి వెన్నఁడును విన్నది కన్నది లేదు మున్ను; చా
లును గణుతింపఁ [1]గోనొఱవలో నిజమో తెలియంగఁ జెప్పుమా
యనఁగ, లతాంగి నీయడుగులాన నిజం బని నమ్మఁ బల్కినన్.

48


వ.

తత్ప్రతీపదర్శినీదర్శనతత్పరుండై తత్పురంబునకుం జని.

49


క.

వన్నె మెఱయంగ నాసతి
యున్నగృహం బప్పు డరసి, యుచితస్థితితో
విన్ననువునఁ జని; యచ్చో
సొన్నాటంకంబువోలు సుదతిని గాంచెన్.

50


తే.

మోవి పవడంబుఁ దమలోన ముడివడంగ
నడుము బయలును దమలోనఁ దడఁబడంగ
మేను మెఱుఁగును దమలోన మేళవింపఁ
దెఱవ యొయ్యారముగ వానిదిక్కు చూచె.

51


తే.

కందు వొరయని పున్నమచందురుండొ
శివునికనుఁబాటు దాఁకని చిత్తభవుఁడొ
కాక, నరమాత్రుఁడే వీఁడు నాకుఁ జూడ
ననుచుఁ దలయూచి కొనియాడె వనజగంధి.

52


క.

వేడుకమై నపు డిరుమైఁ
గాడంగఁ దొణంగె నతనిఁ, గామునిశరముల్
చేడియచూపులుఁ దమలో
సూడించె ననంగ నొక్కసూటిం బెలుచన్.

53


క.

మనసిజుఁ డిద్దఱకును గుం,
టెనకానితనంబు చేసెడిం గనుఁగొన నాఁ,

  1. నీ యొఱపులో నిజమో. అని పాఠము (?)