పుట:విక్రమార్కచరిత్రము.pdf/29

ఈ పుట ఆమోదించబడ్డది

28

బడినవి. ఇక జక్కన యొక్క పద్యరచనాపాటవము, వర్ణనావైదగ్ధ్యము, పాండిత్యము, ప్రతిభ, భావనాశక్తి, శబ్దార్ధాలంకారప్రీతి, శేషయమకఘటనానైపుణి మున్నగు కవితాగుణములను స్ఫురింపఁజేయు కొన్ని పద్యములు మాత్ర మిట నుదహరింపఁ బడును. వానిఁ జదివి సహృదయు లగు పాఠకమహాశయులు జక్కన కవితాశక్తి నవగాహనము చేసికొందురు గాక!

వర్షర్తువర్ణము :
ప్రథమోదబిందులఁ బల్లవించె ననంగ
        నింద్రగోపద్యుతి నిలఁ దనర్చె
భానుచంద్రుల సూడుపట్టి గెల్చె ననంగఁ
        గంధరపటలాంధకార మడరె
జలదానిలంబునఁ బులకించెనో యనఁ
        గుటజభూజంబులు కోరగించె
స్తనితమర్దళరవంబునకు నాడె ననంగ
        వనమయూరములు నర్తనము చేసెఁ
బాంథజనచిత్తచిత్తసంభవమహాగ్ని
ఘనతరజ్వాలజాలానుకరణనిపుణ
వివిధవిద్యుత్పరంపరావిభ్రమంబు
లఖలహరిదంతరంబుల నతిశయిల్లె.(ఆ. 4-31)
దళితానంతదిగంతమై ఘుమఘుమధ్వానంబు సంధిల్లగాఁ
గలయం జాముల వ్రేలఁ గట్టినటు, లుగ్రవ్యగ్రలీల న్నిర
ర్గళధారాళకరాళమై కురిసె వర్షం బెందు నేయింటివా
రలుఁబొర్గింటికి నేఁగకుండఁగ నహోరాత్రంబుఁ జిత్రంబుగన్.(ఆ. 4 - 32)
గగనరత్నముకట్టు మొగులుతో నుదయించెఁ
        జరమదిక్కునఁ దోఁచె శక్రధనువు
పూర్వాపరవ్యాప్తిఁ బొలుపారె జలరేఖ
        లాలోలగతివీచె మూలగాలి
మెఱుఁగు మొత్తంబులు మెఱసె నుత్తరమునఁ
        గడఁగె దక్షిణపు మేఘముల గములు
ప్రాలేయఖానుండు పరివేషగతుఁ డయ్యెఁ
        జాతకంబులు నింగి సంచరించె