పుట:విక్రమార్కచరిత్రము.pdf/27

ఈ పుట ఆమోదించబడ్డది

26

లను బ్రత్యేకముగ రచించుటకుఁ గాని పూనుకొనక తమ పద్యకావ్యములయందే యెడనెడ నట్టి వచనఖండముల నభినివేశముతో రచించియుందురు.

మధురావర్ణనము గాక యిందు ఉజ్జయినీ (ఆ.2-41, ఆ.8-112); వంచక (ఆ. 7-7); అవంతి (ఆ. 7-40); కాంచీ (ఆ. 7-112-118); విక్రమసింహము (ఆ. 7-112) లను పురములును వర్ణింపఁబడినవి.

2. సముద్రవర్ణనము : (ఆ. 5-12).

3. శైలవర్ణనము : శ్రీశైలపర్వతము (ఆ. 1-195-201); మేరుశైలము (ఆ. 2-13) లిందు వర్ణింపబడినవి.

4. ఋతువర్ణనము : వర్షర్తువు (ఆ. 4-26). శరద్వర్ణనము (ఆ. 4-38-39); వసంతర్తు (ఆ. 5-3-16).

5. చంద్రోదయవర్ణనము, చంద్రోదయము (ఆ. 6-67); చంద్రిక (ఆ. 6-69-71).

6. సూర్యోదయాదివర్ణనము : సూర్యోదయము (ఆ. 2-107, ఆ. 3-105); సూర్యాస్తమయము (ఆ. 3-8); సూర్యాస్తమయతమోవర్ణనము (ఆ. 6-62–66); అంధకారము (ఆ. 7-150); సూర్యమండలతాపవర్ణనము (ఆ.2-112).

7. ఉద్యానవిహారము . (ఆ. 5-18-25, ఆ. 8-32).

8. జలవిహారము : (ఆ. 5-38-64).

9. మధుపానము : (?)

10. రతోత్సవము : చతుర్థ, అష్టమాశ్వాసములు.

11. విరహము : (ఆ. 7-62, 64).

12.వివాహము : (ఆ. 4-131-200), అతిదీర్ఘమును, సాంగోపాంగ మయిన వర్ణనము.

13. సుతోదయము : (ఆ. 1-180-184).

14. మంత్రాలోచనము : (ఆ. 4-118-123).

15. దౌత్యము : (ఆ. 4- 58-73)

16. యుద్ధయాత్రావర్ణనము : (ఆ. 4-75-83)

17. యుద్ధవర్ణనము : (ఆ. 4-84-125)

18. నాయకాభ్యుదయము : (ఆ. 4-126-129).