పుట:విక్రమార్కచరిత్రము.pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది

23

గూర్చి ప్రశ్నింపఁగా నది యావంచక రాజసుతుఁ డగు రాజశేఖరుఁడు భర్త కాఁగలఁడని తెలిపి యతని గుణరూపాదులను ప్రశంసించెను. ఇట్లు శారిక వలన మీవృత్తాంతమును విని. రాజపుత్రి విరహబాధకుఁ గుఱి కాఁగా, చెలులా విషయము నామె జనకున కెఱిఁగింప నా రాజు మిమ్ము తోడ్కొని తేర నన్నుఁ బంపె" నని చెప్పి చతురిక మిన్నకుండెను.

రాజశేఖరుఁడు సంతోషించి పరివారముతోఁ జతురిక ననుగమించి, అవంతిపురాంతికోద్యానమున విడిసియుండఁగాఁ జతురిక యరిగి యా వార్త దెలిపి రాజకుమారిక సలకంచెను. సత్యధర్మవిభుఁడు అల్లు నెదుర్కొని తెచ్చి పుత్రిక నొసఁగి వివాహ మొనరించెను. ఇట్లు వివాహితుఁ డయి రాజశేఖరుఁడు భార్యతో గూడ ఆవంచకపురి కరిగి సుఖముండెను.

ఇది జక్కన వర్ణించిన రాజశేఖరుని ప్రధాన కథ. దీని చివఱ శుకశారికల వివాదమునకు సంబందించిన మఱి రెండు చిన్న కథలు గలవు. అందుఁ బురుషులు పాపాత్ము లనుటకు నిదర్శనముగా శారిక చెప్పిన కథ మొదటిది. స్త్రీలే పాపాత్ము లనుటకు శుకము చెప్పిన కథ రెండవది. ఈ రెండును రాజశేఖరుని కథతో సంబంధించినవే. రాజశేఖరుని వివాహకథను మాత్రము జక్కన కవి చక్కని వర్ణనలతో శృంగారప్రధానముగా 74 పద్యములలో వ్రాసెను.

పరిశీలింపఁగా కథాసరిత్సాగము నందు త్రివిక్రమసేనునకు బేతాళుఁడు చెప్పిన సంగ్రహకథనే గ్రహించి జక్కన దానిని గొంత మార్చి పెంచి విక్రమార్కచరిత్రమునఁ జేర్చెనని తోఁచును.

కథాసరిత్సాగము నందలి కథ:-

సందర్భము– త్రివిక్రమసేనుని మౌనమును భంగము చేసి యతనితో మాట డించుటకు బేతాళుఁ డీ క్రింది కథఁ జెప్పెను.

కథ :- పాటలీపుత్రమును 'విక్రమ కేసరి' యను రాజు పాలించుచుండెను. ఆయన యొద్ద 'దివ్యజ్ఞానము' కలదియు 'సర్వశాస్త్రకోవిద'యు నగు చిలుక 'విదగ్ధ చూడామణి' యనునది శాపవశమున నాజన్మ మెత్తినది యొకటి యుండెను. దాని యుపదేశమున నా రాజకుమారుఁడు తనకుఁ దగిన మగధరాజు పుత్రికను 'చంద్రప్రభ' యను దానిఁ బెండ్లాడెను. ఆమెయొద్దను 'సర్వవిజ్ఞానశాలిని' సోమిక యను పేరు గల గోరువంక యుండెను'. ఇది ప్రధాన కథ. దీని చివఱఁ గూడ శుక శారికల వివాదమునఁ బుట్టిన, పురుషులే పాపాత్ము లనుటకు గోరువంకయు, స్త్రీలే పాపాత్ము లనుటకుఁ జిలుకయుఁ జెప్పిన రెండు కథలును గలవు.

సామ్యము:— పై రెండు కథలును మౌనవ్రతమును భంగము చేయుటకు