పుట:విక్రమార్కచరిత్రము.pdf/218

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

విక్రమార్కచరిత్రము


బులదెస, ద్రవ్వితండములు పుష్పము లున్నవి యంచుఁ బ్రోడయై
పలుకువయస్య నేర్పుఁగలభాషిణులెల్లను మెచ్చి రిచ్చలన్.

35


వ.

ఇత్తెఱంగున మత్తకాశిను లుత్తరంగితప్రమవవనవిహారం బొనరించి చాలించి.

36


చ.

చెదరినకుంతలంబులును జక్కుల ఘర్మకణాంకురంబులన్
వదలినకేశపాశములు వాడిననిద్దపుమోముదమ్ములుం
బరనెరవైనవాతెఱలుఁ బైకొనునూర్పులు నుల్లసిల్లఁగాఁ
గదిసినయయ్యనంగవతి గాదిలిబోటులతోడ నిట్లనున్.

37


క.

[1]అలఘుతరాంశుకజాలము
కలుగునె నభమందు ఘర్మకాలము చూడన్
జలకేలి యుచిత మనవుడు
నెలఁతుక కిట్లనిరి చెలులు నిపుణత మెఱయన్.

38


చ.

లలితవళీతరంగరుచులం దరలేక్షణ మీనలోచనాం
చలవదనాంబుజద్యుతి లసత్కుచచక్రవిలాసరేఖ నే
ర్పలరెడునీతనూసరసియందు నిరంతరమున్ విహారమున్
సలిపెడురాజహంసునకు సైఁచునె తక్కినపద్మినీరతుల్.

39


ఉ.

నావుడు నాననాంబుజమున్ దరహాసము తొంగలింప ధా
త్రీవరముఖ్యుఁ డామదవతీతతి కిట్లను, నింతయేల? యే
నీజనజాక్షియాజ్ఞ యొకయించుక యైనను మీఱువాఁడనే
సేవకు లైనవారికి విశృంఖలవృత్తిఁ జరింపఁగూడునే.

40


క.

అని సరసవచనరచనల
దనప్రియసతి నలరఁజేసి ధరణీశ్వరుఁ డా
వనితారత్నముఁ దానును
వనజాక్షులు గొలువ వనజవనమున కేఁగెన్.

41
  1. సా. నులివాళ్లు వాడుచున్నవి, లలితమహాతరుణదేహలతికలు మనకున్.