చతుర్థాశ్వాసము
135
| కులముగ నుల్లసిల్లు రధకుంజరఘోటక సద్భటావళిం | 94 |
ఉ. | అప్పుడు, కుండలీకృతశరాసనులై విలుకాండ్రు తూపులం | 95 |
ఉ. | చాపము లింద్రచాపములచందము చూపఁగఁ, గెపుసొంపువా | 96 |
చ. | బలములు రెంటఁ బేరుగలబంటులరోషమహానలంబులం | 97 |
వ. | అట్టియెడ నుభయబలంబుల నుభయబలంబులునుసు, సేనాముఖంబుల సేనాముఖంబులును, గణంబుల గణంబులును, వాహినుల వాహినులును, నక్షౌహిణుల నక్షౌహిణులును, దలపడి సన్నాహంబుల సముత్సాహంబులు పోషించఁ, గోపంబు లాటోపంబుల భూషింప, హుంకారంబు లహంకారంబుల ముదలింపఁ, జలంబు లచలంబులం బొదలింప, నవార్యంబు లగుశౌర్యంబులు, నఖర్వంబు లగుగర్వంబులు, నశాంతంబు లగుపంతంబులు, నవరోధంబు లగువిరోధంబులు, నఖేదంబు లగుసింహనాదంబులు, నద్భుతారంభంబు లగుసంరంభంబులు నుల్లసిల్లఁ జలంబులు వదలక , బలంబులు ప్రిదులక, భీరంబు లెడలక, బింకంబులు సడలక, బిగువులు దక్కక, బిరుదులు స్రుక్కక, వెలవెలంబాఱక, వెన్ను చూపి జాఱక, తాలిమి దింపక, మాలిమిఁ బెంపక, తలఁగక మలఁగక, విఱుగక సురుఁగక, కేడింపక జోడింపక, వెఱవక చేమఱవక, అత్తళంబులఁ గత్తళంబులుసించియు, శరంబుల శిరంబులు ద్రుంచియుఁ, గుంతంబుల దంతంబులు పొడిచేసియు, | |