పుట:విక్రమార్కచరిత్రము.pdf/171

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

123


స్తనితమర్దళరవంబునకు నాడె ననంగ
        వనమయూరములు నర్తనము చేసెఁ


తే.

బాంథజనచిత్తచిత్తసంభవమహాగ్ని
ఘనతరజ్వాలజాలానుకరణనిపుణ
వివిధవిద్యుత్పరంపరావిభ్రమంబు
లఖలహరిదంతరంబుల నతిశయిల్లె.

31


మ.

దళితానంతదిగంతమై ఘుమఘుమధ్వానంబు సంధిల్లగాఁ
గలయం రాముల వ్రేలగట్టినటు, లుగ్రవ్యగ్రలీల న్నిర
ర్గళధారాళకరాళమై కురిసె వర్షం; బెందు నేయింటివా
రలుఁ బొర్గింటికి నేఁగకుండఁగ నహోరాత్రంబుఁ జిత్రంబుగన్.

32


తే.

ధరణియెల్లఁ గదంబపుష్పరచితంబు
దిక్ప్రకరమెల్ల సరసనర్తితమయూర
మంబరంబెల్ల నీరదాడంబరంబు
విరహిజనచాతకము లెందు విశ్రమించు.

33


మ.

రమణియోన్నతసౌధసీమల విహారప్రౌఢి సంధించుచోఁ
దమకుం గర్జితఘోరఘోషములు నిద్రాభంగముం జేసినం,
బ్రమదం బందిరి కాముకుల్ సమదశుంభత్కుంభికుంభద్వయ
క్రమవక్షోరుహమండలీమదవతీగాఢోపగూహోన్నతిన్.

34


చ.

లలితగతి న్మయూరికలు లాస్య మొనర్పఁగ, [1]భేకభామినీ
కలకలనాదము ల్సెలఁగ, గర్జనవాద్యము లుల్లసిల్లఁ గం
దళకుసుమాంజలుల్ వెలయ, నర్తనశాలయనం దనర్చె భూ
తలము విచిత్రవారిదవితానతిరస్కరణీసమేతమై.

35


ఉ.

హారిమయూరవిభ్రమము లంచలఁ జెందె దటిద్విలాసముల్
తారలఁ జేరెఁ, బుష్పితకదంబవిజృంభణ సప్తవర్ణనా

  1. భేకజంపతీకలకలనాదముల్. వావిళ్ళ. 1926.