పుట:విక్రమార్కచరిత్రము.pdf/168

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

విక్రమార్కచరిత్రము


బూఁదీఁగఁబోఁడిచూపులు చంచలము లని
        మెలవు నెన్నడపున మేళవించె


తే.

నబలనఖములు క్రూరంబు లని తలంచి
సౌమనస్యంబు గుణమున సంతరించె
నీరజాసనుఁ డెంతకు నేరఁ డనుచు
జగము గొనియాడ నొప్పు నాచిగురుఁబోఁడి.

17


తే.

తమ్ము లాకొమ్మనెమ్మోముతమ్ము లనఁగ
బింబ మాయింతికెమ్మోవిబింబ మనఁగ
జాతి యానాతిలేనవ్వుజాతి యనఁగ
రామ యొప్పారు లోకాభిరామ యగుచు.

18


సీ.

తులకు వచ్చియు రాదు తళుకులగని యైన
        గోమలి కాంతితోఁ గుందనంబు
సరియయ్యుఁ గాదు నిశ్చల మైనజిగి నొప్పు
        కాంతయూరులతోడఁ గరభయుగము
[1]ప్రతివచ్చియును రాదు సతతాచ్ఛవిచ్ఛవి
        తరుణికంధరతోడ దరవరంబు
[2]జోడయ్యుఁ గాదు మించులనటించుచునున్న
        చానచన్నులతోడఁ జక్రమిధున


తే.

మింతినెమ్మోము ప్రతిచేసి యెన్నుచోటఁ
జందురునిమేను పూర్వపక్షంబు నొందు
ననఁగ జగమున నావిదర్బావనీశు
ననుఁగుఁదనయకు నెనయైనయతివ గలదె?

19


శా.

ఆవారీమణి, తండ్రిసమ్ముఖమునం దశ్రాంతముం గ్రొత్తగా
నానాగాయకపాఠకోత్తము లొగిన్ సంగీతసాహిత్యవి

  1. ప్రతియయ్యునుం గాదు బహువిలాసములకు రమణిరూపముతోడ రత్నపుత్రి
  2. సమతనొందియు నొంద దమితశృంగారంబు గలయింతినాసతోఁ గాంచనంబు