పుట:విక్రమార్కచరిత్రము.pdf/161

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

113


వ.

తదనంతరంబ.

114


క.

సేతువు దర్శింప మహా
పాతకములుఁ బాసిపోవుఁ, బ్రాణసఖునకు
ఘాతుకమతి నొనరించిన
పాతక మేతీర్థసేవఁ బాయునె నరునిన్.

115


క.

అన విని "సే"యనునక్షర
మనుగతముగఁ బలుకు టుడిగి, యటమీఁద "మిరా"
యనుచుండె నక్కుమారుఁడు
జనపతి నెమ్మొగము హర్షజలధిం దేలెన్.

116


వ.

శారదానందుండు మఱియును.

117


క.

మిత్త్రద్రోహి, కృతఘ్నుఁడు
ధాత్రీసురహంత, హేమతస్కరుఁడు, సురా
పాత్రీభూతుఁడు, నిందా
పాత్రులు వీరెల్ల నరకభవనావాసుల్.

118


క.

అనిన "మివర్ణము" నుజ్జన
మొనరించి, నరేంద్రసూతి యుడుగక "రా, రా"
యని పలుకఁ జూచి, యప్పుడు
మనుజేశ్వరుఁ డుత్సహించె మంత్రులుఁ దానున్.

118


వ.

మఱియు శారదానందుం డిట్లనియె.

120


క.

[1]రాజేంద్ర విజయపాలుని
రాజితశుభమూర్తి జేయ రతిగలదేనికిన్

  1. క. రాజులు మెచ్చఁగ దిక్కుల
    రాజులను జయించి, ధనము రాజులచేతన్
    ఓఁజగొని, విప్రకోటిం
    బూజింపు మనూనదానభోజనవిధులన్. వా. 1926.