పుట:వికీపీడియాను మూల్యాంకనం చేయడం (Evaluating Wikipedia, Telugu version).pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

తక్కువ నాణ్యమైన వ్యాసాల విషయంలో ఏం చేయాలి

మీకు సమయం లేక ఆ అంశంపై విజ్ఞానం ఉంటే సమస్యలను మీరే సవరించుపై నొక్కి సరిజేయడాన్ని పరిగణించండి.

  • ఒకవేళ సమస్య తాత్కాలికమైనదేనేమో చూడండి, ఉదాహరణకి వారి నాయకుడి గురించి విమర్శనాత్మకంగా ఉన్న విభాగాన్ని ఎవరో తొలగించే ప్రయత్నం చేస్తూండడం వంటివి. చరిత్రను చూడండి నొక్కి గత కొన్ని సవరణలు చూడండి.
  • సమస్య చివరి దిద్దుబాట్లలో ఉంటే దిద్దుబాట్లు రద్దుచేసి, సమస్యను తక్షణమే నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఒకవేళ ఆ సమస్య చాన్నాళ్ళ క్రితం నుంచి ఉండి, మీరు దాన్ని సరిజేసేంత సామర్థ్యం కలిగిలేను అనుకుంటే చర్చాపేజీలో సమస్యను వివరిస్తూ ఓ వ్యాఖ్య రాయండి.
  • ఒకవేళ సమస్య తీవ్రమైనదైతే, ఉదాహరణకు జీవించివున్న వ్యక్తిని గురించి అసత్యమైన వాక్యాలు ఉండడం వంటివి ఐతే, సమస్యాత్మకమైన భాగాలు తొలగించేందుకు సంకోచించకండి. ప్రత్యేకించి మీరు కృషిచేస్తున్న వ్యాసం మీ గురించో, మీ సంస్థ గురించో, మీ దేశాన్ని గురించో అయివుంటే మీ పక్షపాతం ఎటు మొగ్గుతోందో కూడా ఆలోచించుకోండి. విమర్శనాత్మకమైన విభాగాలు చాలాసార్లు ఉండదగ్గవే, మరీముఖ్యంగా వాటిని సమర్థిస్తూ మంచి మూలాలు ఉంటే. మీరు చేసిన తొలగింపు గురించి వ్యాసం చర్చ పేజీలో వివరించవచ్చు.

పేలవంగా రాసిన వ్యాసం కనిపించి నప్పుడు మీరేం చేయవచ్చు అన్న విషయాన్ని గురించి మరింత సమాచారం కోసం Wikipedia:writing better articles అని వెతుకుపెట్టెలో రాసి వెతకండి.