పుట:వికీపీడియాను మూల్యాంకనం చేయడం (Evaluating Wikipedia, Telugu version).pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

నాణ్యతలేని వ్యాసాల చిహ్నాలు

  • వ్యాసానికి పైన హెచ్చరిక బానర్ ఉంటుంది. మరిన్ని హెచ్చరిక బానర్లు వ్యాసం మరీ చిన్నగా ఉందని, విస్తరించమని కోరుతున్నవి లేదా వివరం చెప్తున్నవి అయివుంటాయి. కానీ హెచ్చరిక బానర్ వ్యాసం తటస్థతపైనో, మూలాల నాణ్యతపైనో పరిష్కారం దొరకని వివాదానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండొచ్చు.
  • ప్రధాన విభాగంలో అనేక భాషాపరమైన సమస్యలు ఉన్నాయి. ప్రధాన విభాగంతో ఉన్న సమస్యలు చాలాసార్లు మొత్తం వ్యాసంతో ఉన్న సమస్యల్ని సూచిస్తాయి. బాగా చిన్న ప్రధాన విభాగం ఆ వ్యాసం ముక్కలుముక్కలుగా అభివృద్ధి చెందిందని, ఆ క్రమంలో మొత్తం రచనపై దృష్టిపెట్టలేదని సూచిస్తూండొచ్చు.
  • నిష్పాక్షికత లేని తొలగించాల్సిన మూలాలులేని అభిప్రాయాలు, తమ గురించి తాము చెప్పుకునే అంశాలు వ్యాసంలోని భాష సూచిస్తూండవచ్చు. ఉదాహరణకు, ‘‘ఆమె అత్యుత్తమమైన గాయని’’ అనడానికి బదులు ‘‘ఆమె ఏ ఇతర గాయని పొందని విధంగా 14 విజయాలను దక్కించుకున్నారు’’ అని ఉండాలి.
  • వ్యాసం కొందరు లేదా పలువురు లేదా ఇతర పేరువెల్లడించని సముదాయాల గురించి పేర్కొంటుంది. ఈ వాక్యాలు మరీ సాధాగా రాయబడినవి, వీటిని వాస్తవాలతో భర్తీచేయాలి.
  • విషయ సూచిక, వ్యాసం వంటివి చూస్తే వ్యాసంలో కొన్ని ముఖ్యమైన అంశాలు కనిపించట్లేదు అనిపిస్తుంది. జీవితచరిత్ర వ్యాసాల్లో ఆ వ్యక్తి జీవించిన కాలం గురించి వివరాలు వదిలేస్తే ముఖ్యమైన వాస్తవాలు లేనట్టే.
  • కొన్ని విభాగాలు వాటి ప్రాముఖ్యతతో పోలిస్తే చాలా పొడుగున్నట్టు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఓ సంస్థకు సంబంధించిన వ్యాసంలో మిగతా అంతా చిన్నగా ఉండి విమర్శలు అన్న విభాగం మాత్రం అతిపెద్దగా ఉంటే ఆ సంస్థకు వ్యతిరేకంగా ఆ వ్యాసం పక్షపాతం చూపిస్తోందని అర్థం.
  • వ్యాసానికి అతితక్కువ మూలాలు కలిగివుండడం, వ్యాసంలో గణనీయమైన భాగాలకు పాదసూచికలు లేకపోవడం. ఒక వ్యాసం మరీ తక్కువ మూలాలు కలిగివుంటే, అది ఆ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం లేకుండా రాసివుండొచ్చు.

చర్చ పేజీలు విద్వేషపూరితమైన వ్యాఖ్యలతో నిండివుండడం. వ్యాసంపై కృషిచేస్తున్న వాడుకరులు వైరుధ్యమైన దృక్పథాన్ని గట్టిగా పట్టుకునివుండి సామరస్యానికి రాలేకపోతుంటే, వ్యాసం ఒకవైపే విపరీతంగా పక్షపాతం కలిగివుండొచ్చు, లేదా అంతగా వివాదంలేని అంశాలపై అవసరమైనంత దృష్టిపెట్టకుండా వివాదాస్పదమైన అంశాల గురించి మరీ ఎక్కువ వివరాలు కలిగివుండొచ్చు.