పుట:వికీపీడియాను మూల్యాంకనం చేయడం (Evaluating Wikipedia, Telugu version).pdf/5

ఈ పుట ఆమోదించబడ్డది

నాణ్యమైన వ్యాసాల్లో ఉండే అంశాలు

సాధారణంగా, అత్యుత్తమమైన నాణ్యత కలిగిన వ్యాసాల్లో ఐదు అంశాలు ఉంటాయి: • వ్యాసంలోని విషయాన్ని తేలికగా అర్థంచేసుకునేందుకు పనికివచ్చే ప్రధాన విభాగం • స్పష్టమైన వ్యాస నిర్మాణం • సమతుల్యమైన పరిమితి, భద్రత • తటస్థమైన సమాచారం మరియు, నమ్మదగిన మూలాలు

  • ప్రధాన విభాగం అర్థమయ్యేలా వుండి, వ్యాసంలోని ముఖ్యమైన అంశాల సారాంశం చూపిస్తుంది. ఉదాహరణకు జీవిత చరిత్రలోని ప్రధాన విభాగంలో ఎందుకు ఆ వ్యక్తి పేరుపొందారు మరియు ఆమె ఎక్కడ జీవించారు అన్న వివరాలు ఉండాలి, కానీ ఆమె బాల్యం గురించి వివరంగా ప్రధాన విభాగంలో అవసరంలేదు, దానికి ఆ తర్వాత వచ్చే విభాగం తగినది.
  • నిర్మాణం స్పష్టంగా ఉండాలి. అనేకమైన శీర్షికలు, ఉపశీర్షికలు ఉన్నాయి, చిత్రాలు, బొమ్మలు తగిన స్థలంలో, అనుబంధం, పాదసూచికలు చివర్లో ఉన్నాయి. చాలావరకూ వ్యాసాలకు, విషయం కాలక్రమానుసారంగానో, నేపథ్యాన్ని అనుసరించో ఏర్పాటుచేస్తారు.
  • విషయానికి సంబంధించిన అనేకాంశాలు సమతుల్యంగా ఉన్నాయి. ఏ అంశమూ వ్యాసం మొత్తాన్ని ఆక్రమించుకోదు, అన్ని ముఖ్యాంశాలకూ న్యాయం జరిగింది. బాగా ముఖ్యమైన అంశాలు వ్యాసంలో ఎక్కువ చోటు కల్పించుకున్నాయి.

ఉదాహరణకు ఓ పిల్లి జాతికి సంబంధించిన వ్యాసంలో సుదీర్ఘమైన వివరణ ఆ జాతి స్వభావం గురించి ఉండి, శారీరిక లక్షణాల గురించి అతికొద్ది సమాచారం ఉండడం, అసలే సమాచారం లేకపోవడం జరిగితే అది మంచి సమతుల్యమైన వ్యాసం కాదు.

  • తటస్థ దృక్కోణం కలిగివుండాలి. వ్యాసాలు నిష్పాక్షికంగా రాయాలి; ఆ విషయానికి సంబంధించిన పండితుల్లో ఎక్కడైతే అనంగీకారం ఉంటుంది అనే విషయాని గమనించి ఆ విషయాన్ని అవసరమైన సమతుల్యంతో వివిధ దృక్కోణాలలో అందించాలి.

నమ్మదగ్గ మూలాల్లో వాటి ప్రస్తావనలు ఏ పాళ్ళలో ఉన్నాయన్నదాని బట్టి అనుకూల, ప్రతికూల అంశాలను చేర్చాలి. మంచి వ్యాసాలు తటస్థమైన భాషను, వాస్తవాలపై ఉద్ఘాటన కలిగివుంటాయి. వ్యాసం చదివితే ఒప్పించేందుకు రాసిన వ్యాసంలా అనిపించకూడదు, నిజమైన విజ్ఞాన సర్వస్వ వ్యాసంలా అనిపించాలి.

  • నమ్మదగ్గ మూలాలకు రిఫరెన్సులు ఇవ్వడం ముఖ్యమైనది. మంచి వ్యాసాలకు అనేకమైన పాదసూచికలు కింద ఉంటాయి. అనేకమైన లంకెలు వ్యాసంలో ఉంటే మీరు బాగా నాణ్యమైన వ్యాసం చదువుతున్నారకోవచ్చు. చంద్రమండలం గురించిన వ్యాసంలో నాసా వారి జాలగూడుకు లంకెలు ఇవ్వాలి కానీ అనుభవం లేని ఖగోళ శాస్త్రవేత్త బ్లాగ్ కి కాదు.