పుట:వికీపీడియాను మూల్యాంకనం చేయడం (Evaluating Wikipedia, Telugu version).pdf/3

ఈ పుట ఆమోదించబడ్డది

వికీపీడియా వ్యాసం పరిణామాన్ని గమనించడం

ప్రతి వ్యాసమూ ఎలా పరిణామం చెందిందో దాని పైన ఉన్న చరిత్రను చూడండి అన్న లంకెపై నొక్కి చూడవచ్చు. వ్యాస సంభంద గత అన్ని మార్పులు అక్కడ దొరుకుతాయి.

చరిత్రను చూడండి అన్న పేజీలో, ప్రతి అడ్డువరుస వ్యాసం యొక్క ఒక వెర్షన్ ని సూచిస్తుంది. ఆ వెర్షన్ చూడడానికి తేదీపై నొక్కాలి. ఒక్కో వెర్షన్ ఆ సవరణ చేయడం ద్వారా ఆ వెర్షన్ మార్పు చేసిన వాడుకరి పేరున ఉండడం గమనించవచ్చు.

కావాల్సిన మార్పుల మధ్య తేడాలను ‘‘ఎంచుకున్న మార్పులను సరిచూడండి’’ అన్నదానిపై నొక్కి ఏ రెండు వెర్షన్లనైనా పోల్చి చూడవచ్చు. మీరు రెండు వరుసల కాలమ్‌లు చూస్తారు. ఎడమపక్క ముందు వెర్షన్, కుడిపక్క దానికన్నా తదుపరి వెర్షన్ కనిపిస్తాయి. రెంటిలో భేదాలు ప్రముఖంగా లేదా పెద్దగా కనిపిస్తూ వుంటాయి. ఈ సదుపాయాన్ని ఏం జరిగిందో నిర్ధారించడానికి – రెండు వెర్షన్ల నడుమ కాలంలో ఏ సమాచారం చేరిందో, తీసివేయబడిందో తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు.