పుట:వికీపీడియాను మూల్యాంకనం చేయడం (Evaluating Wikipedia, Telugu version).pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది

వికీపీడియా ఇప్పటివరకూ రూపొందినవాటిలో అతిపెద్ద విజ్ఞాన సర్వస్వం

ఇది వందలాది భాషల్లో ఉంది. సంప్రదాయికమైన విజ్ఞాన సర్వస్వంలా కాక ఎవరైనా మార్చదగ్గ విధానం కలిగివుంది. ఎవరైనా వ్యాసాలు రాయడం కానీ, వాటిని మార్చడం కానీ చేయవచ్చు, వ్యాసాల నాణ్యతలో భేదాలుండవచ్చు. మీలాంటి చదువరులకు వ్యాసం మంచిదా కాదా అన్నది గుర్తించగలగడం ముఖ్యమైన అంశం.


వికీపీడియా అంటే ఏమిటి? వికీపీడియా అనేది ప్రత్యక్ష ముఖాముఖీ(ఇంటర్వ్యూ)లాగా ప్రాథమిక మూలం కాదు, విద్యాసంబంధిత పత్రంలానో, వార్తా కథనంలానో రెండవ మూలం కాదు. వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. అది ప్రాథమిక, ద్వితీయ మూలాల నుంచి సేకరించి వ్యాసాలుగా మార్చిన సమాచార భాండారం. ఇతర విజ్ఞాన సర్వస్వాల లాగానే వికీపీడియాను మొదటి స్థానంగా ఉపయోగించాలి. అది మీకు విషయంపైన విస్తృతమైన విజ్ఞానన్ని అందజేసి, అత్యుత్తమ నాణ్యత కలిగిన ప్రాథమిక, ద్వితీయ మూలాలను కనుగొనేందుకు ఉపకరిస్తుంది.

వికీపీడియా మీకు ప్రధానంగా వీటి ద్వారా ఉపయోగపడుతుంది:

• ఒక విషయం యొక్క స్థూల, పరిశీలన పొందడానికి • ఆ విషయంలో సూచించదగ్గ రచనల జాబితా పొందడానికి • సంబంధిత అంశాలను కనుగొనేందుకు

వికీపీడియా వ్యాసాలు ఎలా రూపొందుతాయి? సాధారణంగా వికీపీడియా వ్యాసం మొత్తంగా ఒకేసారి తయారవదు. సవరణ సవరణకీ, తరచు వేర్వేరు రచయితల, సభ్యుల పరస్పర సహకారంతో వ్యాసాలు అభివృద్ధి చెందుతుంటాయి. ఒక సభ్యుడు వ్యాసం ప్రారంభిస్తే, మరొకరు మరింత సమాచారం చేర్చవచ్చు, ఆపై ఇంకొకరు దాన్ని చదవడానికి తేలికగా పునర్వ్యవస్థీకరించవచ్చు. ఏ ఒక్కరికీ వ్యాసం స్వంతం కాదు, కానీ చాలామంది తమ సమయం పెట్టుబడిగా అభివృద్ధి చేసినందున వ్యాసంపై ఎక్కువ శ్రద్ధను కలిగిఉంటారు