పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/180

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

వరాహపురాణము


క.

ఈలక్షణములు గలిగిన | సాలగ్రామోత్తమములు సంసారులకున్,
మేలొసఁగుఁ బూజితములై | భూలోకమునందు, విష్ణు[1]భువనమునందున్.

112


క.

వేమఱు సాలగ్రామశి | లామాత్రము బ్రహ్మచర్యలక్షణయుక్తుం
డై, ముక్తి గోరు[2]యతికిని | సామర్థ్యము[3]నం భజింపఁ జను ననఘాత్మా!

113


ఉ.

కావున విష్ణుభక్తి మదిఁ గల్గి, నరోత్తముఁ డంబుసంభవం
బై విలసిల్లు పద్మదళ మంబులిప్తము గానిరీతి, దో
[4]షావిలఘోరసంసరణసంగతుఁ డయ్యు, సుతాదిమోహవ
ల్లీవితతిం దగుల్వడి చలింపక, సజ్జనసన్నుతాత్ముఁడై.

114


ఉ.

ఉత్తమమధ్యమాధమకులోద్భవుఁ డయ్యును, సత్యవాక్య[5]సం
గత్తరుఁడై, నిషిద్ధములు కామ్యములు న్విడనాడి, నిత్యనై
మిత్తికకర్మముల్ హరికి మెచ్చుగఁ జేయుచు, నన్వయోచితో
దాత్తచరిత్రుఁడై, పరమధార్మికుఁడై, భగవత్ప్ర[6]పన్నుఁడై.

115


శా.

సాలగ్రామశిలాస్వరూపహరిఁ బూజం దన్పి, తత్పాదతీ
ర్థాళిం గ్రోలి, తదర్పితాన్నముల నాహారించి, తద్భక్తర
క్షాలోలుం డగుచు న్మెలంగి, జగదాశ్చర్యంబుగాఁ జెందుఁ, ద
న్నాళీకాక్షవిహారహారజనితానందైకభోగంబులన్.

116


వ.

ఇంక నొక్కయితిహాసంబుఁ జెప్పెద నాకర్ణింపుము.

117


చోరోపాఖ్యానము

సీ.

పాటలీపురవరప్రాంతదక్షిణసీమ | శేఖరాహ్వయ మగు శిఖరి గలదు,
తద్గిరీంద్రమున బుత్రస్త్రీసమేతుఁడై | శూరాస్యుఁ డను నొక్కచోరకుండు
నిలయంబు కల్పించి, నిల్చి త్రోవలు గట్టి, | నరులఁ జంపుచుఁ దద్ధనంబులెల్ల
సంగ్రహింపుచుఁ బాపసంయుక్తుఁడై, ధేను | మాంసముల్ భుజియించి మత్తుఁ డగుచుఁ,


తే.

బ్రతిదినంబును సుతదారబంధువితతి | నరసి పోషింపుచును [7]శస్త్రహస్తుఁ డగుచుఁ
జౌర్యవిద్యాప్రవీణుఁడై, సాహసమున | నుక్కుమిగిలి విజృంభించి యొక్కనాఁడు.

118
  1. లోకమునందున్ (యతి?) - మా
  2. నతనికి - ర
  3. సంభవింప - మ,మా,తా,తి,తీ,హ,ర,క
  4. షావలి - తీ; షానల (ప్రాస?) - తి; షాఖిల (ప్రాస?) - మా
  5. రంగత్తరుఁడై - తి,తీ; తంగత్తరుఁడై - మ,మా,త,తా,హ,క
  6. సన్నుఁడై - మ,తా
  7. చక్ర - మ,తి,తీ,హ,ర,క