పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/153

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

55


మ.

హరివాక్యానుగుణంబుగా, సకలదేవానీకసంయుక్తులై,
పరిపూర్ణోత్సవ[1]జాతహుంకృతులచే బ్రహ్మాండ మల్లాడఁగాఁ,
దరువం జొచ్చిరి దానవుల్ నిజభుజాదర్పంబు రెట్టింప, సు
స్థిరధాత్రీవలయావధిన్, బహుమణిశ్రేణీనిధిన్ వారధిన్.

129


శంకరుఁడు గరళక్షోభము మాన్పి లోకము నుద్ధరించుట

క.

పురికొని తరువఁగ, నాలోఁ | బరమాద్భుతలీల భువనభయదజ్వాలా
తరళము, సర్వదిగంతా | విరళము, గరళంబు సంభవించెన్ మొదలన్.

130


వ.

[2]ఇట్లు ప్రళయానలాభీలంబును, జ్వాలాజాలకరాళంబును, జగన్నాశమూలంబును
నగు కాకోలంబు వొడమి, సకలబ్రహ్మాండమండలోన్మూలం [3]బొనరింపం దలంప, నిలింప
దానవసముదయంబు భయంబు నొంది, రయంబునం గడలి వెడలి, యిక్కార్యంబు చక్కం
బెట్ట దిక్కు ముక్కంటివేల్పు దక్కం దక్కొరుండు లేఁడని మృత్యుంజయుపాలికిం జని.

131


మ.

“పరమేశాయ, పరాత్పరాయ, గిరిజా[4]భాగ్యాయ, తుభ్యం నమః
కరుణాపూరితమానసాయ, విభవే, కల్మాణరూపాయ, శం
కర! మాం [5]పాహి" యటంచు మౌళిఘటితాఖండాంజలీద్వంద్వులై
సురదైత్యుల్ శరణంబు చొచ్చి, గరళక్షోభం బెఱింగించినన్.

132


ఉ.

పాటవ మొప్పఁ జేరి, కరపద్మమునం గబళించి, శీతరు
గ్జూటుఁడు నవ్వుచు న్మెసఁగెఁ జూర్ణితపద్మభవాండమండలీ
[6]పేటము, నుద్ధతారవవిభీషితదేవనిశాటమున్, నినా
ఘాటముఁ, గాలకూటము, నకాండలయంకర[7]రూపకీటమున్.

133


క.

హాలాహలకీలాభవ ! నీలిమ గళమూలమంద, నిలిచిన కతనన్
బాలేందుధరుఁడు, శంభుఁడు, | కాలహరుం డొప్పె నీల[8]కంధరుఁ డనఁగన్.

134


వ.

ఇట్లు కాలకూటంబు శూలిచేత నిష్పీతంబైన, దేవాసురవరులు [9]నిర్భీతులై, జలధి
కొట్టం దొణంగి రంత.

135
  1. జాల - మ,తా,తి,తీ,హ,ర,క
  2. వ 131, ప 132, ‘ర’ ప్ర. లుప్తము
  3. బు దహింపం - మ,మా,తి,తీ,హ,క
  4. భార్యాయ - మ,మా,తా,తి,తీ,హ,క
  5. త్రాహి - మ,తి,హ,క
  6. ఫేటము నంధతా - మ,మా,త,తి,తీ,హ,క
  7. కీటరూబమున్ - మ,తి,తీ; కీటరూపమున్ - మా,త,తా,హ,క
  8. కంఠుం డనఁగన్ - త,తా
  9. నిర్భయులై - మ,మా,తా,తి,తీ,హ,ర,క