పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/104

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

వరాహపురాణము


సీ.

చుట్టంబు పూర్ణిమశోభితయామినీ | [1]ధవచంద్రికాధాళధళ్యమునకుఁ,
జెలికత్తె శీతాంశుశేఖర ప్రథమాంగ | జాహ్నవీజలచాకచక్యమునకు,
సైదోడు నీహారశైలగండోపలా | నీకనిర్మలనైగనిగ్యమునకు,
జనని దుగ్ధాంబోధిఘనవీచికాఫేన | తరళతా[2]భరధాగధగ్యమునకు,
తే. హారహీరపటీరనీహారతార | తారకాకాశవాహినీపూరరుచిర
రుచి రమాకర్షణ[3]క్రియాప్రచుర మగుచు | [4]వెలయుఁ గొలిపాక చెన్నని విమలకీర్తి.

31


శా.

శ్రీనిత్యుండగు చెన్నమంత్రి సరిగాఁ జింతింతుఁ, దేజోనయ
జ్ఞానైశ్వర్యరుచిస్వరూపజనరక్షాపాత్రదానంబులన్;
భానున్, భార్గవు, భారతీరమణునిన్, భర్మాద్రిబాణాసనున్,
భానీకప్రభు, భావజున్, భరతునిన్, భాస్వత్తనూజాతునిన్.

32


ఉ.

చిత్రచరిత్రుఁ డాసచివశేఖరుసోదరుఁ డెఱ్ఱమంత్రి సౌ
భ్రాత్రధురంధరుండు, హరిభక్తిసమేతుఁడు, మాదమాంబ, లో
కత్రయవర్ణనీయగుణ, కాంతఁ, బతివ్రత, నన్నమంత్రిరా
ట్పుత్రికఁ, బెండ్లియాడె, సిరిఁ బొల్పుగఁ గైకొను శౌరికైవడిన్.

33


శా.

ఆసాధ్వీమణియందు నెఱ్ఱవిభుఁ డార్యానందసంధాయక
శ్రీసంపన్నుల, భూసురోత్తమకృతాశీర్వాదసంవర్ధితో
ల్లాసోత్సాహచిరాయురు న్నతులఁగల్యాణాత్ములం గాంచె, వి
ద్యాసంపూర్ణుల, వేదమంత్రిపు ననంతామాత్యకందర్పునిన్.

34


వ.

తదనుజుండు,

35


ఉ.

ఒప్పులకుప్ప, దానఖచరోత్తముఁ, డాహవసవ్యసాచి, దు
గ్ధాప్పతికన్యకాధవపదాంబురుహభ్రమరుండు, బుద్ధిచే
నప్పరమేష్టిఁ బోలిన మహాత్ముఁడు, సర్వయమంత్రి పుత్రుఁ డా
తిప్పన, ధీరతం బసిడి [5]తిప్పన మించె ధరాతలంబునన్.

36


ఉ.

వీరలపిన్నతండ్రి ధర విశ్రుతిఁ గాంచిన రామమంత్రి మం
దారుఁడు, చంద్రచందనసుధాకరకుందమరాళమల్లికా
హారపటీరహీరసముదంచితకీర్తియుతుండు, వీరమాం
బారమణీమణిం బరమభాగ్యవతిన్ వరియించెఁ గూరిమిన్.

37
  1. ధవళచంద్రిక - హ
  2. భవ - మ, త, తా, తి, తీ, హ, ర
  3. ప్రియా - మ, తా, తా, తీ, హ, ర
  4. వెలయ - మ, మా, త, తీ, హ
  5. తిప్పను - తి, హ, ర