ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

నేమి, చూపఁబడునట్టిది కాక స్పష్టముగను ప్రసిద్ధ ముగ గోచరించు చుండవలయు. మూ ర్తీభవించి చాల కాలము ప్రేక్షకుల నేత్రములకుఁ గట్టినట్లుండ వలయు, జీవితముల కాదర్శము గావలయు. మన చిత్తములలో నాటు కొనఁగలవి ప్రధానపాత్రల గుణచర్యాదులే యగుటచే నవి నీతిదాయకము లగుట చాల యవశ్యకము. ఏవిదూషకుని చర్య యందో ఏపరిచారిక నడతయందో నీతిగలదన్నచోఁ జాలదు. సావిత్రీ చిత్రాశ్వమును, అహల్యాసం క్రందనమును ప్రదర్శింపఁబడి నపుడు వానియందలి ముఖ్య పాత్రల గుణ చేష్టస్వభావాదులు చూపఱ హృదయసీమల జనింపఁజేయు భావములకుఁ గల తారతమ్యము నెఱుగవర్ణింప నక్కరయుండదు. తారాశశాంకుల జంఝాటముల నెల్ల పూసగ్రుచ్చిన తెఱంగునఁ దర్శించి, "తగని దాంపత్యమునఁ గల్గు ఫలమిట్టి”దని కొనకొక నీతిముక్కను బడ వేసినచోఁ జాలునన నెవఁడు సాహసించును? కాన, నాటకముల యుపయోగము, వాని కథల ననుస గించి యుండుననుట.

ఆధునిక నాటకకర్తలు పలువు రీ యంశ ముపై దృష్టి వదలి స్వేచ్ఛగా కథలఁగైకొని నాట కముల జాతికే కళంకమును దెచ్చిరని చెప్పక .