ఈ పుట అచ్చుదిద్దబడ్డది

77

బుద్ధి గఱపుచు నాహ్లాదకరము లగుటఁబట్టియే వాని కీ శ్రేష్ఠత్వమనుట నిర్వివాదాంశము. రామా యణము జరుగునంత కాలమును రాముని వెంట నుండి పరీక్షించుచు సతని జీవితమునుండి నీతిని గ్రహింపవలెనన్న నెందఱకు సాధ్యము? ఎన్నఁడో ఏ దేశముననో, ఎన్ని యేండ్ల కాలముననో నడి చిన చరిత్రములలోని యనుపయుక్తాంశములు నెల్ల వదల్చి స్వల్పకాలమున వానిసారమును మాత్రము మనకన్నుల యెదుటఁ బెట్టుశక్తి యీనాటకములకు మాత్రమే గలదు.

కాని, నాటకమని పేరు బెట్టుకొన్నంతనే నెత్తిఁ బెట్టుకొని పూజింపవలెననుట కాదు. సర్వ జనోపయుక్తమగు నీతిబోధించు సత్కథా సంవి ధానముగల్గి, హృదయంగమరచనా వైదగ్ధ్యముతో నొప్పి, ప్రపంచానుభవ శాలురగు సత్కవులు రచిం చిన నాటకములే నాటకములు కాని యితరములు బూటకములు. సత్కథా ప్రణాళికచే నలరు నాటకములు నీతిబోధచే లోకమున కెంత యుపక రించునో దుష్కథా సరణిం గూర్పఁబడ్డ నాటక ములు దుర్నీతి కాదర్శ ప్రాయములై ప్రపంచ మునకంత యహితముఁ గూర్చును. వానిలోని నీతి వ్యంగ్యరూపముగ నేమి, ఛాయామాత్రముగ