ఈ పుట ఆమోదించబడ్డది

76

వ్రాసిన కావ్యము సప్తవిధ సంతానములలో నుత్తమసంతానమనుట కేమిలోపము? ఇక యిప్పటి సాధనత్రయమున వెలువడు గ్రంథములు-అందునను పోలు పొఁదు లేని నవలలు - నూటఁదొంబది వంతులు గ్రంధకర్తల దేహములపై మొలచిన దుర్మాంస గ్రంధులన్నను నాకు బాపమురాదని నామాశయము.

   "విద్వత్కవయః కవయః
   "కేవల కవయస్తు కేవలం కపయః"
 


నాటకతత్వము

13

కావ్యములలో నెల్ల నాటకములు శ్రేష్ఠములని పెద్దలుపలుకుదురు. లోకమునందలి జనుల వ్యవహార వ్యాపారాదులను వానియందలి గుణదోషములను, తత్తత్ఫలములను, అన్నియు నున్నవి యున్నటుల ప్లేక్షకుల కనుల ముందఱ నుంచి కనులారఁ జూచి యనుభవమునకుఁ దెచ్చికొండని బోధించునవి నాటకములే యగును. కావ్యశాస్త్రాదులు పండిత హృదయములకు మాత్రము గోచరములగుటం జేసి నాటకములు పామరులకుఁ గూడ