ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

టియో రెండో కావ్యములకే కృతిపతికాఁగలిగెను. ఆకాలమునఁ గృతులు నంకితమిచ్చువారి సంఖ్య చాలస్వల్పము. ఇపుడో, అంబరాగ్రహాది ప్రదా నములచే నర్థింపకున్నమానెఁగాని యడుగకయ మున్న గ్రంథముల రాసులుగఁ దెచ్చి మంక్షిత మిచ్చుదాతలు వేనవేలుగలరు.క్రోసుదూరమున నుండియే కవుల కొకవేయినమస్కారములు చేయు చుంటంబట్టియే కాకున్న నీవఱకు కట్నములతోడఁ గూడఁ గావ్యకన్యకలనిచ్చి యెందఱు వరసకు నాకు మామగారగుచుండిరో 'నేనిపుడూహింపఁ జాలను

కాని యొకటిమాత్రము మరువరాదు. కావ్యము సప్తసంతానములలో నొకటిగఁ బరిగ ణింపఁబడఁదగినది. శబ్దేందుశేఖరము మంజూష యను గ్రంథములకచించిన పండితో త్తముఁడు నాగోజీ దీక్షితుని నొకరు సంతానమునుగుఱించి ప్రశ్నింపఁగా నతఁడు,

  "శబ్దేందుశేఖరః పుత్రో
  మంజూషా మమ పుత్రికా.”

అని సమాధానమిచ్చెనఁట పాండిత్యము- నకుఁ దోడు ప్రపంచానుభవముగల్గి పెద్దనా మాత్యుఁడన్నట్లు సప్తసాధనయుతుఁ డయినకవి