ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

నోపాయముల నెఱుంగనివారు కవిత్వమును శరణ మాశ్రయించు చున్నారు. పెద్దనకాలము నాఁటి: కన్న నిపుడీ విద్య యతిసులభము. నాఁడువలసిన సస్త సాధన సామగ్రి యిపు డక్కరలేదు. నేడు కవనమునకు వలసిన నెల్ల మూడే సాధనములు! ప్రవాహలేఖని (ఫవుంటఁన్ పేనా) యొకటి; అక్బరు సాహ చుట్టల పెట్టియ (లేక షాజహాన్ పొడుము కలకాయ) రెండు; తేనేటిచేనిండిన పాత్ర (లేక రెండు మూఁడు తులముల నల్లమందు) మూఁడు. గద్యకావ్యమున కింతచాలును. పద్య ప్రబంధము లకు సులక్షణ సారములోని యయిదారు పద్య ములు వచ్చుటకూడ మంచిదే! ఈమాత్రపు సాధన సహాయమున లెక్కకుమీఱిన గ్రంథములు.. బయలు దేరుచున్నవి. కాననే నేఁటికాలమున నిట్టి గ్రంథవర్షము! పిచ్చి బాణుఁడొక్క నవలలో నొకభాగము మాత్రమే వ్రాయఁగలిగెను కాని యిప్పటికావ్యములఁ జూడుఁడు. పూర్ణిమనాఁడారం - భమయి యమావాస్యనాఁడు కడముట్టునవి కొన్ని, మఱికొన్ని యేకాదశి యుపవాసమున నుదయ మంది ద్వాదశి పారణతో ముక్తిపడయునవి!

మఱియొక విశేషము! కృష్ణ దేవరాయఁ డాంధ్ర భోజుఁడను ఖ్యాతి గడించెనేకాని తుదకొక