ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

మగునను మాటలో నెంత సత్యమున్నను, పాండిత్య మునకు దూరమై ప్రపంచానుభవనమునకుం బాసి భావనా శిల్పముల: నెఱుంగక వ్రాయఁబడు కవిత కును గవితయనుపేరు చెల్లునేని, యిఁక ప్రపంచ- మున నూటికి నూరువంతులు కాళిదాసులే యగు దురుగదా? అపుడాడిన మాటలన్నియు నాశు ధారలై పాడిన పాటలెల్ల ప్రబంధములగును. అపుడు “నీవు బ్రహ్మాండ భాండములను సృజించినచో "నేను మంటి భాండముల సృజింతును. నాకన్న నీదేమి ఘనత?” యని “కుమ్మరియును సృష్టికర్త నధిక్షేపింప వచ్చును.

పోనిండు. భోజరాజు కాలమునాటి గొల్ల పిల్లలజోలి మన కేల. కాని, కవులును, కావ్యము లును బ్రపంచమున నంత యగ్గువగ లభించుట యసంభవము. అద్వితీయ మేధావి శేష భూషితులై యధీత సకల శాస్త్రార్థసారులై యధిగతలోకాను భవవివేకులైన మహాకవులు సయితము తమజీవిత కాలమంతయు నొకటి రెండు గ్రంథములు రచించుట యందే గడపిరి. కవనమున కక్షరలక్ష లభించు కాలములో నుండియు కవికుల శ్రేష్ఠుఁడగు భట్ట బాణుఁడు తనవ్రాయఁగడంగిన కాదంబరిలో నొక భాగము మాత్రమే తన యాయుఃపరిమితిలోఁ