ఈ పుట అచ్చుదిద్దబడ్డది

69

శక్తియు నభిమానము నాతనిఁ బెడత్రోవకీడ్చి తుదకెట్టిస్థితికిఁ దెచ్చినదో చదువరు లెఱిఁగియే యున్నారు. మఱి ఇంక సుదాముని జూడుఁడు! అతఁడు కట్టుబట్టలేక, కుచేలుఁడని పేరొందెను. తన యిరువది యేడ్వురమంది కొడుకులు నాకలిచేఁ బట్టి పీడించుచున్నప్పుడు గూడ, తన జీవితముపైఁ గాని, సృష్టించిన భగవంతునిపైఁగాని విసిగికొన లేదు. ధనార్జనమునకై న్యాయమునకు దూరమైన యేషన్నుగడను తలంపలేదు. అట్లే చిరకాలము కష్టములనొందెను. తుదకై హికాముష్మీక సుఖ ముల నొందగలిగెను.

అన్ని నీతిశాస్త్రములయు, అన్ని ధర్మ శాస్త్రములయు, అన్ని మతగ్రంథములయు, సార మీ సత్యసంధతయే. అది లేక యుండెనా మా నవుఁడెంత పండితుఁడైనను, ఎంతయాచారవంతుఁ . డై నను ఏవగింపదగినవాఁడే. 'సత్యము సర్వశ్రేయో మూల'మని పెద్దలే నుడివియున్నారు.

ఏమతాభ్యాసమునకైన నాచార్యుడవసర మేమోకాని దీనికి నాచార్యుఁడే యనవసరము. అన్ని వేళల మంచి నుపదేశించెడి మనయంతరా- త్మయే యాచార్యుఁడు. కనుక హృదయంగమము. లైనను చెడద్రోవలఁ బడనీక సన్మార్గముల నేర్ప