ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

ల్కొని మరలి రాలేక తుపానులచే దరికికొట్టబడి పగిలిపోయెను.

మన దేహయాత్ర నౌకాయాత్ర వంటిది. విషయవ్యామోహమను నయస్కాంత పర్వత శక్తిచే చిత్తవృత్తు లాకర్షింపబడినప్పుడు, మనుజుఁ డట్టిట్టు కదలలేక సన్మార్గమునకు దూరమై దుఃఖమునకు జిక్కి నశించును. కనుక విషయము లకుఁ జిక్కక సన్మార్గమునఁ బ్రవర్తించిననే తప్ప మనుష్యుడు జీవిత పరమావధిని జేరలేడు. వేగమెంత యసదైనను నావమార్గమునందున్నచో గొంతకాలమున కేని తన రేవు చేరఁగలుగును, "కాని యించుక మార్గమును విడచిన నావకెంత వేగము - న్నను, ఆవేగము దాని రేవునుండి దూరముసేయుట కే యుపయోగించును. అట్లే మనుష్యుని శక్తి కొంచమైనను సన్మార్గమందున్నచో కొంత కాల మున కేని యది యతని పరమావధి సేర్చగలు గును. సన్మార్గమునుండి తప్పిన వానిశక్తి యెంత యున్నను నది యతని యవధినుండి క్రమక్రమ ముగా దూరస్థుని జేయును.

కులము, రూపము, ప్రాయము, పరువము, ఐశ్వర్యమును గలిగి సర్వవిధముల నొప్పిన సుయోధ నుఁడు కొంచెము విషయప్రవిష్ణుఁ డగుటచే, నాతని