ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66


దిమ్ముపట్టింప దివురు చుండును. ఆశా ప్రవాహ ములు పెడదారిం బెట్టి సుడివడఁజేయుచుండును. విశేషమిందేమన, కనుచూపునఁ దోచునవన్ని- యు హృదయంగమములై నేత్రానంద దాయక ములగు రాజమార్గములే ! వానిలోఁ దగినవాని నేర్పరించుకోను జాణతనము మానవున కత్యా వశ్యకము.

కాని సన్మార్గము ననుసరించుట మనుజునకు శక్యమా? ఇది సరియైన మార్గమని యతఁడెట్లు కనుగొనగలఁడు! అగాధ సంసారాంబుధిఁబడి కొట్టు కొనుచు నానావిధములగు యాతనలచే బాధపడు నాతనికీ దరిజేరనగు మార్గ మెదరుబోధింతురు?

మహార్ణవమున నెన్నియో యోడలు ప్రతి దినమును రేయియనక పగలనక రేయనక పగలనక ప్రయాణము సేయుచునేయున్నవి. అవి తమ గమ్యస్థానమునకు నియమిత కాలమునందు తప్పక చేరుచున్నవి. మా- లియు యేతొందరలేక యెప్పుడును శాంతచిత్తుఁడై యే యుండును. వానికి దిగ్భ్రమ యెన్నడును గలుగదు. వాఁడేదిక్కునకుఁ బోవలసియుండినను దారిని చూపున దొక్కటే! అదేది? ధృవనక్షత్రము. అదిస్థిరము. ప్రపంచమున నేది మార్పు చెందినను ధృవనక్షత్రము తన చోటు మారదు. ఎట్టి చిక్కు