ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

గూబ బ్రతికినట్లు బతికిన నేమి సుఖమని యెత్తి పొడిచెను.

“విద్యానామ సరస్య రూప మధికం
ప్రచ్ఛన్న గుప్తం ధనం ”

అని యొకడు సాధింపఁగా, కాదని,

“అసారే ఖలు సంసారే
సార స్సారంగ లోచనా!”

యని యింకొకఁ డుదహరించెను. ఇట్టి మూర్ఖులం గూర్చియే.

శా|| "చన్నుల్ కాక పసిండి కుండ లఁట! వక్ష
              శ్చర్మ దుర్మాంసముల్,
      కన్నుల్ క్రొవ్విరి దమ్మి రేకులఁట! వే
              ల్ల ద్దూషికా గోళముల్,
      వెన్నుల్ సోగ యనంటి యాకులఁట! సం
              వీతార్థి పుంజంబులీ,
      యన్నుల్ సౌఖ్యముగాఁ దలంచు జను లా
              హా యెంత మూఢత్ములో"

యని వ్రాసిరని ద్వితీయుఁడు నవ్వెను. వాని మిత్రున కిది యరకాలఁ బెట్టిన కొరవి నెత్తికెక్కి నట్లయ్యె. అతఁడు రోషావేశమునఁ దటాలున లేచి "ఛీ! అబలాజాతి నింత యగౌరవమాడిన చండాలుఁడు భూమిలోనుండ ననర్హు ”డని చేతి