ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కొనిరి. తోడనే చెఱియొక వివిక్త స్థలమునఁ గూ- ర్చండి నాఁడు రేయెల్ల కనుజేప్ప వేయక యనేక ప్రకారములఁ దమ మేధాశక్తిని తలక్రిందులు సాముచేయించుచు వాకండలు నాలోచించుకోను చుండిరి.

మఱునాఁ డుదయమున నొక చోట వారే- ల్లరు సమావేశమైనపుడు ప్రధముఁడైశ్వర్యము కోరుదమనియె. ద్వితీయుఁడు శాశ్వత దేహారోగ్య మునుగోరెను. "సంపదలు. క్షణ భంగురములు దేహము బుద్బుద ప్రాయము. సుఖమన్న నిరంత రమును గామినీజనపరివృతుఁడై దర్పకుని తక్కథై లాడించుటే సుఖ"మని తృతీయుఁడు వాదించె. నాలవయతఁడు "విద్యాధనమే సుఖ" మనియెను. నలుగురును వాదులాడఁజొచ్చిరి; తర్కింపసాగిరి. పూర్వపక్షములు లెక్కకు మీరి బయలు దేరెను. దానిలోఁ గొన్ని తునుక తునకలుగ ఖండింప బడియె. కాని సిద్ధాంతము స్థిరపడ లేదు. రెండు దినములు గడచె .

మూఁడవ నాఁడు కూడ సాయంకాలము దాక వాదముజరుగుచునే యుండెను. “ఆరోగ్యమే సుఖ; మెన్నియున్న నేమి?” యని యొకఁడు స్థాపిం- పఁగా నితరుఁడు, తినకూడును, కట్టుబట్టయు లేక