61
ఒక యవ్వ నీళ్ళకై వచ్చియుండి నాశూన్య దృష్టు లను బరధ్యానమును గమనించి కారణమడిగెను. మునుపు హరికథకుఁ బోయిననాఁడు కూనలమ్మ కీర్తన పాడిన యవ్వగా గుర్తించి నాయాలోచనల నామె కెఱిఁగించితిని. ఆమెయు నవ్వి వినుమని నాకీకథఁ జెప్పెను.
పూర్వ మొకప్పుడు నలుగురు యువకులు చేరి ప్రపంచమున నత్యుత్కృష్టమగు సుఖమును బడయఁగోరి చాలకాలము పంచాగ్ని మధ్యమునఁ దపమాచరించి రఁట! దైవము వారికీఁ బ్రత్యక్షమై కోరికె యడుగఁగా నందఱు నేక వాక్యమున “మహా ప్రభూ! సర్వోత్త మమగు సుఖమును బ్రసాదిం- ఫుము.” అని ప్రార్థించిరి, “సరే! కాని చెఱి యొకవిధమగు సుఖ మివ్వవలనుపడదు. నేను మరల మూడుదినములకు వచ్చెదను. ఆలో మీరు నలుగురును మంతనముండి మీ యండఱకును రు- చించు సర్వోత్తమమగునట్టి సుఖమేదో నిర్దరించు కొని నాకుం జెప్పినచో నిచ్చెడ” నిని భగవంతుఁ జానకిచ్చి తిరోహితుఁడయ్యె.
నాఁడంతయు తనంతనాలోచించి విషయము నిర్ధారించుకొని మఱునాఁ డొక్కొ కఁడు తన సిద్దాం తమును వ్యక్తము సేయునట్లుగవారు తీర్మానించు