viii
నవి. తమ యందలి యాజీవశక్తిని బలవంతముగా రవులుకొల్పి బయలు దేర్పఁగల యుత్సాహమును, ఉద్రేకమును గలవా రాకాలమునఁ గొందఱే. ఈ వ్యాసకర్తలకు ఆకొందఱిలోఁ జేరుట కధికారము గలదు కాని ఉత్సాహోద్రేకము లున్న వారి కందఱికిని ఫలముగాని పనిచేయు త్రోవలు కాని ఒక తీరున నుండవు. భరత ఖండమునకు స్వాతంత్య్రమును శక్తిని సంపాదించు నాత్రముతో పనిచేసిన దేశ వీరులలో కర్మాగారములను స్థాపించినవారు కొందఱు, కారాగారములకు పోయినవారు కొందఱు; అసెంబ్లీలకుఁ బోయినవారు కొందఱు, అండమాను దీవులకుఁ బోయినవారు కొందఱు; అందినను అందుకున్నను జుట్టుపట్టుకొని పోరాడబోయినవారు కొందఱు, కాళ్ళు పట్టుకొని విదిలిం పులు తన్నులుఁ దిన్న వారు కొందఱు; చంపినవారు కొందఱు, చచ్చినవారు కొందఱు; తామొక్కరు కష్టపడి త్యాగము చూపుటకంటె ప్రజలలో నుద్బోధము గలిగించుట యుత్తమమని తలఁచి మఱికొంద ఱుపన్యాసముల మూలమున నాపని చేయుదురు. ఇంక కొందఱు - తమ వా క్ఛక్తిమేర నెఱిఁగినవారు - వ్రాత మూలమున నా