ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

ప్రియవిరహమున నసువులువాయు రమణులును మనకుఁ గ్రొత్తలుకారు. సామాన్యదృష్టికి జీవి- తోద్దేశములుగఁ గానవచ్చు దేహబుద్ధి బలములును, జ్ఞాన వైరాగ్య సంపదలును, విద్యావివేకధనము లును, మున్నగువానిపై మానవులకుఁగల యాశను విమర్శించి చూచినచో నన్నింటికిని నిదానము సుఖాసక్తిగ స్పష్టముగ గోచరించును. అంగనా వ్యాసంగపరుఁడు మొదలుగ నంతరాత్మ వ్యాసంగ పరుని దాఁక సర్వులును సుఖము - సుఖ మనియే భ్రమించుచుండుట! కానీ సుఖమెందున్నది?

ప్రత్యుత్తరమునకుఁ దత్త్వజ్ఞులు ముందు వెనుకచూడరు. జీవితోద్దేశ మిట్టిదని మతాచార విధుల ననుసరించియో, ప్రకృతిశాస్త్ర రహస్యములు మూలమున నూహలనల్లి యోయుపన్యసింపవత్తురు. ఆకాశమున మేడల నిర్మించుకొని గాలి యుయ్యెల లలో నూగుచు మనసున మండిగలు చేసుకొని రచియనుభవింతురు.

అవాఙ్మానసగోచర మగు వస్తువు నెఱుఁ- గుటకై వినువానికన్న నుపదేశించువాని కెంత యర్హతయున్నదో నాకింకను బోధపడినదికాదు. పోనిండు. మన మిపుడు నేరువవలసిన విద్య బ్రతుకు, బ్రతుకున సుఖులమైతిమేని ధన్యులమే! కాని