ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరోజనః అని శ్రీకృష్ణమూర్తి యానతిచ్చె. కాన సంఘమునఁగల లోపములకును సత్స్వభావములకును దాదాపుగా శ్రేష్ఠులే నిధాన మనవచ్చును.

చెప్పవచ్చిన దేమన సంఘము బాగు పడవలెనన్న,

"గ్రుడ్డియగునెద్దు జొన్నంబడ్డ పగిది”

కాక, రసస్వభావముల ననుసరించుపట్ల మనము యుక్తాయుక్తముల నరయుటయు గొప్ప వా రనిపించుకొనుచుఁడు వారు తమ యవలంబించు వేష మత స్వభావాదులలోఁ గడు జాగరూకత వహించుటయును నత్యవశ్యకములనుట!

'

_________'


స్వకీయచరిత్ర

9

'నేటి యుదయమున నా సంపాదకుఁడు నాకీ క్రిందిజాబు నొసంగెను.

"ఆర్యా! 'వధరుఁబోతు' పత్రికలఁజదివి యానందించు వారిలో నొక్కఁడనేను. కానీ మీరిట్లు వ్రాయస గాని కులగోత్ర నామాదుల మఱుఁగుపఱచియుం-