ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

శిఖయే మిత్తియని బోధించెననుకొనుడు- నామాట నమ్మకున్న నాయత్నము చాలదు కాని - నెల రెణ్ణెలలలోనే పురుషప్రపంచమున నూటఁ దొలి- బదిమంది నున్నని తలలుగలిగి గడ్డములు నిమురు కొనుచుందురని నాదృఢవిశ్వాసము.

మన స్త్రీలు గూడ నీజాడ్యమునకు లోను గాకపోలేదు. వారియలంకార పద్ధతులు గుఱించి క్షణమాలోచించినచో నామాటలోని సత్యము మనమున స్ఫురింపక మానదు. వివరణమునకు నేఁడు నాకవకాశముచాలదు గాన మరల నెన్నఁ- డైన జూతముగాక.

మఱి యొక్కటి! పరుల ననుసరించుట మన స్వభావమే కాని కంటఁబడినవాని నెల్ల యనుసరిం చుట సామాన్యముగ మనలక్షణము కాదు. బిచ్చగాఁ డేమిచేసిన నదిచూచివచ్చి యనుసరించు పిచ్చివాఁడుండఁడు. మండలాధిపతి దేవాలయము నకు వెళ్ళువాఁడైనచో నికనా దేవతకు గురుబలము సంపూర్ణముగఁ గల్గినట్లే. న్యాయాధికారి సంధ్య వార్చునని యెఱింగినచో న్యాయవాదు లెల్లఁ బ్రాతస్నానము లాచరింపక యిలు వెలువడరు. బడిపంతులు కుస్తీచేయువాఁ డైనయెడఁ బాలురు జెట్టీలుకాఁగోరుదురు. ప్రపంచధర్మ మిట్టిదనియే,