ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

పంచమునంతయు ఋష్యశృంగ మయముగా నొన రించి యుందుమేమో?

మనుజుని జీవిత పరిణామమునకిది యిట్లా ధారభూతమగుటంజేసి యేతద్విషయమున మన మెంత జాగరూకతతో మెలంగినను నెక్కువయన రాదు. ఛాయాపటమును దీయుటకై సిద్ధముగ సమర్పఁబడిన దర్పణ ఫలకమువంటిది మానవ హృదయము. సమయమునకై వేచియుండి బింబ మునకు యుక్తదూరమునఁ దగుపద్ధతిని దర్పణము నుంచమేని ప్రతిబింబము పాడయి యనుపయోగ కరమగుననుట మనమెఱుఁగనిది కాదు. ఇతరుల. స్వభావాదుల ననుకరించుపట్ల మనమును విచ్చల విడిగఁ బ్రవర్తించినచో, జేకూరు ఫలసిద్ధియు నట్టిద. తగని యాదర్శములఁ గైకొనుట యట్లుండ సదాదర్శముల ననుకరింపమి కూడ మన జీవిత మును జుక్కానిలేని యోడం జేయును. కావుననే చిన్ననాటినుండి సత్సాంగత్య మలవడుట యదృష్ట ఫలమని పరిగణింపఁబడుచున్నది.

అతివిస్తృతమగు నీప్రపంచమున లెక్కకు మిక్కిలి యగు గుణములును స్వభావములును నిరంతరము మనచుట్టును గోచరములగుచుఁడును. వానిలో మన స్థితికిని, అర్హతకును, దేశకాల