45
లును. దీనినిజూచి కొందఱు పకపక నవ్విరి. కొంద ఱధరోష్ఠముల ముడియైన విప్పక గంభీర ముగాఁ దిలకించిరి. మఱికొందఱు 'ఇదేటి పాడు 'పేరు' అని యసహ్యపడిరి. ఈ మూవురి భావము లర్థముగాక బాలురు గొంద ఱెగాదిగఁ జూచిరి; ఇందఱను నవ్వించుట కేమిమార్గము! ఒకటున్నది. అదేమనఁగా నిందఱినినవ్వింపఁ బ్రయత్నించుటయే.
కాబట్టియే మావదరుఁబోతు ఇన్ని చిక్కు - లకు లోఁబడిన హాస్యమును గూర్చి యౌదాసీన్యము వహించినది. పూర్తిగా మౌనము వహింపలేదని మాచదువరులలోఁ గొందలైన నెఱుఁగుదురు. ఇంతమాత్రమునఁ బొట్టనిండని హాస్యభోజనులగు మాచదువరు లెవరైన నున్న వారికి మామనవి యొకటి. తానుబెట్టకున్నను పెట్టుచోటు చూపుట మానవ ధర్మముగదా! హిమవంతమునకు నావల నెందో యొక పర్వతమున్నదని పురాణములు నుడువుచున్నవి. దానిపేరు హాస్యపర్వతమఁట! అది యిచ్చోటనే కలదని నికరముగాఁ జెప్పు నంతటి పౌరాణిక భూగోళఙ్ఞానము మాకు లేదు. మాచిరంజీవి వ్యాసుని విచారించి కొంత కష్టపడి యైనను చదువరులు దానిని గనిపెట్టుదురేని యది