ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

విషయచర్చలోఁ బ్రవేశించిన మెదడు నడుమ నడుమ నేమైన సంజుకొనకున్న కార్యము సాఁగదు. మాకు హాస్యరసమువలని ప్రయోజనమంతే; కాని, నవ్వుటయే జీవితమున కాధారమనియు, ఆరోగ్య కరమనియు, నెన్నిమాఱులు సవ్విన నన్ని దినము- లో గంటలో యూయువువృద్ధియగుననియు నపూర్వ సిద్ధాంతములఁజేయు హాస్యరస దేవతలను దృష్తి పఱచు సామర్థ్యము మాకులేదు. మేమును మాచదువరులవలె మనుష్యులలో మనుష్యులము గానేయుండగోరెదముగాని వారిపాలిటి బ్రహ్మలము గావలయునని సంకల్పింపలేదు. కారణమేమనఁగా బ్రహ్మపదవి నధిష్ఠించితిమేని తరువాత మాకింత పత్రిఁబెట్టు వారును లేకపోవుదురేమో అనుభయము.

మనవారికి హాస్యరసముపై నేల యింత యభినివేశము? కారణమున్నది. చదివిన చదు వంతయు బ్రతుకునకై వినియోగించి పరులకు దాసులయిన వారి బ్రతుకే హాస్యము! కాక, పగ లంతయు దమ కిష్టములేని పనియందో చేతఁగాని చేఁతయందో కడపుచుందురుగావున మేధస్సంతయు నీరసమై యుండును. కావున నూతన విషయములఁ జర్చించుటకుఁగాని చర్చించువారి హృదయములతో నేకీభవించుటకుఁగాని యోపికయుండదు. అట్లగుట