ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

పాండిత్యముగల్గి నిరంతరము పలువురు శిష్యులకు సాత్వికవిద్యాదానము సేయువారుగాన పురజనులు వారి నా బిరుదమున గౌరవించిరి. కాని తాను మాత్ర మనామధేయురాలుగ నేలయుండవలెనని పట్టుబట్టి వారి జాయ కొన్ని దినములలోనే కడు ప్రయాసతో తనపూన్కి నెఱవేర్చుకొనియెను. లోకు లామెకు 'ఆంధ్రతార' యను బిరుద మియ్యక తప్పినదికాదు.

నేఁడుదయము దపాలావాడు పుస్తకము నొకటి దెచ్చి యిచ్చెను. అది యాంధ్రకాళిదాస ప్రహసనము; వృద్ధసరస్వతి కొండలరాయశర్మ ప్రణీతము. అభిప్రాయార్థమై మాకార్యస్థానమ- లంకరించినది. పుట త్రిప్పి చూచితిని -- పీఠిక పుట 1, అభిప్రాయములు 24, విన్నపము 57, గ్రంథా రంభము 64, ప్రకటనలు 68. అనివిషయసూచిక యున్నది. సరే గొప్పగ్రంథమె యనుకొని పీఠికను రుచిసూచితిని. “పండితులారా!-- శనిగ్రహస్తుతి తెనిఁగించి యాంధ్రశని యనియు, కలిపురుషుని తైలాభిషేక వ్యాఖ్యకు టిప్పణము వ్యాసి యాంధ్ర కలినాథుఁ డనియు, ఆంధ్రనామ సంగ్రహమున కనుక్రమణిక గూర్చి నవీన వాగనుశాసనుడనియు బిరుదముల