ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

మును మనకు లేకుండుటకు మనలోపమా? కాక మన విద్యల పాపమా? కాదు. మనము చదువు నేర్చితిమి కాని వివేకము నేరువలేదు. విద్య తెలివి నిచ్చును; వివేకము. తెలివికి మంచిత్రోవ సూపును. మొదటిది సాధనము. రెండవది ఫలము. లభించిన సాధనమును మన ముపయోగ పఱచుకొన జాలమైతిమి. కత్తి చేతఁబట్టినపుడు మనుజుఁడు శత్రువుల ఖండించి కీర్తి నార్జింపవచ్చును. సరికదా తనముక్కు చెవులనేని కోసికొని నల్గురిలో నగు బాట్లును గావచ్చును. మనముగూడఁ జదువు నిట్లే యుపయోగించుకొను చున్నారము. ఇతరుల మేలునకుఁ గాకున్నమానెగాని, మన విద్య పొట్టకు బట్టకునుగూడఁ జాలదు. మఱి దీని యుపయోగమితరులఁ దప్పుపట్టనే! కాననే యొక్క పండితుఁడు “విద్య వివాదముకొఱకే” యని సెల పిచ్చెను.

వివేకము నేర్పని విద్యవ్యాసునికడ నేర్చినను వ్యర్థమే. వివేక మక్కఱలేనివాఁడు సకలవిద్యలను సాష్టాంగ ప్రణామములతో సాగనంపవచ్చును. పుణ్యమునకును పురుషార్థమునకును రాని విద్య బుద్ధికిఁ గష్టమేకాక నూనెకును నష్టము. మూఢుడు తానొక్కఁడు చెడినఁ జెడవచ్చును. అవివేకి