ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

మొగము చిట్లించుకొనును."షేక్స్పియరు” నాటకముల సారస్య మెఱిఁగిన నవనాగరకుఁడు రాజ భాషరాని శ్రోత్రియునిఁ బరిహసించును. మంగలిరంగనిపాఠము వచ్చినంత నవనాగరిక బాలిక మడి గట్టుకొని గోపికాగీతలు బాదుకొను ప్రాత ముత్తెదువఁజూచి గేలిసలుపును. ఈ యిరు తెగల విద్యావంతులును బల్లెలలో నెవరి జోలియు లేక 'నాగలే నావిద్య' యనియున్న హాలికుని నీచపుచూపు చూతురు. కాని వాఁడీ ప్రాత విద్యల నధిక్షేపింపలేదు; కొత్త విద్యల హాస్యము సేయనులేదు. వానికి రఘువంశముపైఁగాని, "షేక్స్పియరు” నాటకముపై గాని ద్వేషము లేదు. భారతమును వానికి నిజమే; బైబిలును సత్యమే. మృతమునకుఁ బాత్ర మాధారమా, పాత్రమున కాధారము ఘృతమా, యని తల పగుల గొట్టుకొను పండితులును, రాలిన పండు నేలఁబడుట నేలగుణమా? పండు గుణమా! యని కూడునీరువిడిచి చింతించు శాస్త్రజ్ఞులును వానికి సమానులే. ఈచదువు రామిచే వాని కితరుల గొడన యక్కర లేదు. వానిది వేఱువిద్య.

ఈహాలికునికుండు సమబుద్ధియు, సహన-