25
ముగ, యథాసావకాశముగఁ జరుగఁగలవు; కాని సద్వినియోగమున కపుడు గూడఁ దీఱిక యుండదు. ఇంక నియమితముగ దమ పనులొనరించుకొని కాలము నుపయోగించు కొనువారి కపుడు గొప్ప కష్టము. ఇప్పటి యిరువదినాల్గు గంటలే చాలి యున్న కారణమున వారి కప్పుడు పని యుండదు.
ఇంతమాత్రము కాక సృష్టికర్త కప్పుడు మూఁడు గొప్ప చిక్కులు దాపరించును. ఆస్థాన శాలలలోను కార్మికాగారములయందును పగ లంతయుఁ బనిచేయవలసిన చిన్ని యుద్యోగులును సేవకులును నిరంతరము నతనిందిట్టుచు శాపోదక ముల విడుచుచుందురు.కాలము గడుపలేని పు- ణ్యాత్ముల యుపయోగమునకై కొఱత పడకుండ చీట్లపేకల 'బస్తా'ల సిద్ధముచేసి సంపుటకు వేఱొక “అమెరికా” దేశమే సృష్టి కావలసి యుండును. ఇంటఁ గూర్చుండి మగల వేధించితినుచు నేపని పాటలు లేక దినమున కిపుడు మూఁడు గంటల కాలమేని సద్వినియోగము సేయనేరని మని నాగరక తరుణీజనమునకై సృష్టికర్త యపుడేమి పని నిర్మింపవలసి యుండునో నే నింకను నాలో- చింపఁదగియున్నది. "It is generally the idle who complain