ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

మన యోగ్యతయే! వాస్తవముగ నుపయోగింప లేనంతఁ కాలము మన యధీనమున నున్నది. యంత్రమున కావిరిశక్తి గల్గినచో మన ముప- యోగించు కొన్నను లేకున్ననుఁగూడ నది పని వేయుచుండును. వలసిన పనులఁ జేయింపనిచో మానవ స్వభావము మనచే వ్యర్థ కార్యముల నేని జేయించునుగాని యూరకుండదు. ఇట్టి యభ్యాస మతిశయించు కొలఁది కాల మంతయు వ్యర్థకా ర్యాచరణమునకే సరిపోవుటం జేసి సత్కార్యము లకు మన కప్పుడు “తీఱిక లేదు.”

ఇంచుమించుగ నీయనర్థమున కంతయు మన నాగరికతయే నిదానము. అనాగరకుఁ డెన్నఁడును కాలము నిట్లు నిందింపడు. పని పరిమిత మగుటచే వానికి జాలినంత యవకాశ మున్నది. పగ లంతయు నొడల నీరుట్టు నట్లుగ నాగేఁటితోఁ గష్టపడి పంట పండింపనున్న హాలికు నకుఁగూడ 'కాలము సమృద్ధిగ నున్నది. అక్కర మాలిన పనుల నధికముగ నంటగట్టుకొన్న మనకు మాత్రమే యీ యవస్థ. తెల్లవారలేచి మధ్యా- హ్నము దాఁక సబ్బునంటించుకొని త్రిప్పి త్రిప్పి చూచుకొనుచు ముఖముండనము చేసికొన మన వారికిఁ దీఱికయుండునుగాని మిత్రుని జాబునకు