ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

కొంద ఱుపహారములఁ దినుచుండిరి; కొందఱు పోలుపొందులేని విషయములఁ జర్చించు చుండిరి; మఱి కొందఱు యువకు లూరక నిలుచుండి చుట్ట దాబి గుప్పు గుప్పున పొగ వెడల విడుచుచు నాకసమున నది సెందు పరిణామములను శ్రద్ధతోఁ దిలకించుచుండిరి; ఒక రిద్ద ఱుపహారముల నార- గించువారివంక సాసూయముగఁ జూచుచుండిరి.

ఆయువకులలో నొకడు 'వదరుఁబోతు' పత్రిక నొక్క_టిని జుట్టఁజుట్టి డా కేలఁబట్టియుంటఁ జూచి, నాగరకతరుణులుగూడ నాపత్రికల మ- న్నించుచున్నారని యానందించితిని. అది యెన్ని యవ లేఖయో, తద్విషయములపై నతని యాశ- యమేమో కనుఁగొన నెంచి యతనిఁ బ్రశ్నింపగా నతడు తన కది చదువఁ బ్రొద్దులేదనియు, వల- దన్న గౌరనహాని యని తానది పుచ్చుకొనవలసి వచ్చెననియుఁ జెప్పి నాసంశయముఁ దీర్చెను. 'అకటా! పొద్దులేదఁట! ఒక్క "ఈజిప్టు" చుట్ట నెవఁడైన దానము చేసియుండినచో నానిరంతరో- ద్యోగి యంటే నిలువంబడి యింకొక గడియపఱకుఁ గాలు గదల్చియుండఁడు గదా! నా యానంద- మున కంతరాయ మొదవ విషణ్ణుఁడనై మన నాగరకతరుణుల 'ప్రొద్దులేమి'కి వగచుచు నిలు-