10
ఱును సత్యవంతులును ధర్మపరులు నగుదురా? - అప్పుడు మోక్షమార్గము సుకరమగునా? లేనిచో నిట్టి నిరర్థక ప్రయాసను మానవుఁ డెందుకొఱకు పడుచున్నాడు? ఫలమున్నను లేకున్నను మనము శ్రమంబడి యీ తత్త్వము దెలిసికొనుట యవసరమా! తెలిసి కొననిదే మనజీవయాత్రఁ గడపుట దుష్క రమా! మనమిట్టి యోజనలఁజేసి వాస్తవ స్థితి నెఱుఁగ వలయునని సృష్టికర్త యుద్దేశమై యుండునా?
ఇక మతములన్నియు నేదేనొక విధమున దేవుని బ్రార్థింపవలయు, నాతనియెడ భక్తిఁగలిగి యుండవలయుననిగదా చెప్పుచున్నవి. మన మెల్లప్పుడు నాతనియెడఁగృతజ్ఞతఁ గలిగి సదా యాతని బ్రార్ధనఁజేయవలయునని యాతనియభీ స్టమా! అయినచో నాతనికిఁ గలుగు లాభమేమిః బ్రహ్మాండమునెల్ల సృజించిన యాతనికి మన మే యుపకారము సేయఁ గలుగుదుము. ఓ దేవుఁడా! నీవు దయామయుఁడవు. ప్రేమస్వరూపుఁడవు. నే ననుభవించున వెల్లయునీవొసంగినవియ. నేనెల్ల - ప్పుడును నీయందుఁ గృతజ్ఞుఁడవై యుండెదను. అనిసతిదినము నతనిగుఱించి స్తోత్రము సేయుట వల్ల నాతనికిఁ గలుగు మోక్ష మేమి?