ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశకుల మనవి.

వదరుఁబోతు వ్యాసములలో లభించినవి మాత్రము ఇప్పుడు ప్రకటించితిమి. సగానకు సగము దుర్లభములై యున్నవి. నశించిన వనియే భయము. ఇప్పుడు దొరకినవిగూడ హిం దూపురమందలి శ్రీ॥ పక్కా గురురాయాచార్యుల వారి ఆంధ్రసార్వతాభిమానపు బలమున బ్రతికినవి. ఎంతో భద్రముగా చాఁచియుంచినవానిని వారు ప్రకటనార్థము ప్రార్థించిన వెంటనే మాకు దయ చేసిరి. వారికి మేము చాల కృతజ్ఞులము. ఇవి గూడ నశించునేమోయని యింతయాత్రముగా ప్ర కటించితిమి.తక్కినవి మా భాగ్యముచే ఎవరి వద్దనేని యుండినచో వారు దయయుంచి మాకు తెలియఁబఱచెదరేని ధన్యుల మగుదుము. ముందు ప్రకటింతుము.

ఇందలి వ్యాసములకు పెట్టిన పేరులు మొదటీ ప్రకటనమందు లేవు. చదువరుల యానుకూ ల్యమునకై యిప్పుడు ఊహింపఁబడినవి. ప్రతివ్యాసము తుదను కర్తగుర్తుగా వేసికొన్న యక్షర ములు మొదటనుండినవి, యిప్పటి ప్రచురణము లో పొరఁబాటున వదలఁబడినవి. సాధ్యమైనంత