ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

లోకములో నెన్ని యో వేల మతములున్నవి. ఒక్కొక్క మతము వార లొక్కక్క దేవుని సమ్ము చున్నారు. అందఱును వారి వారి యూహల కందినట్లు స్వస్థ నరకములఁ గల్పించుకొని మను ష్యుఁడు దానుజేసిన పుణ్యపాపములఁ బట్టి స్వర్గ మునకో నరకమునకో పోవునని గట్టిగా నమ్ము చున్నారు. ప్రతివాఁడును దనమతమే యుత్కృష్ట మైనదనియు నితర దేవతలఁ గొల్చువారు పుణ్య- ములంబడయఁజలరనియు వాదించుచున్నారు. ఈ వాదము లెన్ని యో వేల యేండ్ల నుండియు జఱుగు చున్నవి; యింక ముందెన్ని వేల యేండ్లకును నిలిచి పోవునవి గావు. ఇది తెలిసి యుండియు నీతత్త్వముఁ మార్చి, శాస్త్రజ్ఞులును, తార్కికులును, కవులును, విద్యావంతులును దమ జీవిత కాలమంతయు విచారించుట వృథా కాలహరణముసేయుట గాదా? ఎందులకిన్ని శాస్త్రములు భూమిననతరించుట? ఇందఱు మతాచార్యులు, ఇన్ని దేవాలయములును వట్టి యాడంబరములేనా?

కాని యొక వేళ లోకములోని జనులందఱును సమ్మతించి యొక మతమునే , యొక దేవతనే శ్రేష్ఠ ముగా నొపుకొందురుబో, దానివలన మనుష్యునికిఁ గలుగు లాభమేమి ? అప్పుడు మాత్రము జనులంద