ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

అచటి వారు వానిని 'దొంగ' యనియు, కథ కడ్డము వచ్చెననియుఁ జీవాట్లు పెట్టుచు నవలఁ ద్రయసాగిరి. వానిగతి పాప మనిపించుచుఁడెను. అంతలో నచటి ముసలియవ్వ యోర్తు లేచి వారిని వారించి “నాయనా! అన్నము పెట్టెదర”మ్మని యాబాలునిఁ దోడ్కోని పోవసాగెను. కథను వదలి పోవుచున్నదేయని నే నాశ్చర్యపడి "అవ్వా హరికథవలదా?” యంటిని. ఆమె నవ్వి యిట్లనుచు వెడలి పోయెను.

 "జపతపంబుల కన్న, చదువు సాముల కన్న,
  నుపకారమే మిన్న, యో కూనలమ్మా!

____________


సృష్టికర్త ఉద్దేశ్యము

2

నిద్రించునపుడు తప్ప మనుష్యుఁడెల్ల వేళల యందు నేదేనొక విషయమును గూర్చి యోజించు చుండును. అతని భావనా సముద్రమునఁ బ్రతి క్షణమును వేరువేరు యోచనాతరంగము లుప్ప తల్లి యాయుత్తరక్షణముననే యణఁగిపోయి క్రొత్త వానికిఁ జోటిచ్చును. ఎట్టి భావములఁ జొఱని