ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

నంతఁ దమ శాస్త్రమునఁ గాకున్న బ్రపంచమే యుండదని జ్యోతిష్కులు పొంగుదురు. మోయ లేని బరువుమోసిగాని, ఇనుపసంకెలలఁ ద్రెంచిగాని చూపఱచే సెబా సనిపించుకొన్నంత సృష్టికర్త యుద్దేశము నెఱవేరెనని “కలికాలభీములు” కొం దరు సంతసింతురు. స్వభావసిద్ధమగు పుంభావ మునకు లేని పోని స్త్రీత్వమును బలాత్కారముగ నారోపించుకొని 'చిత్రాంగిగానో, 'తార'గనో రంగస్థలమున నటింపఁగోరి, యొంటిగ నద్దము ముందు నిలిచి యక్కఱమాలిన నవ్వును, అనవసర మగు శోకమును సక్రమముగ నభ్యసించుచు, దమ వికార చేష్టలకుఁ దామే యానందించుకొను బృహ న్నలలు కూడఁ గలరు. సర్వస్వమును బచ్చింటఁ గుదువ యుంచి బాలామణికో మోహనాంగికి. చరణదాసులై, సమయమెఱిఁగి మునుముందుగ సానతిపొంది యామిటారి తాంబూల రక్తాధరమును ముద్దుగొని యందలి యమృత ధారల - అబ్బ!--- చేరలబంటి జుఱ్ఱుచు “బ్రహ్మానందాధి రాజ్యపదవి లోనున్న తరుణమూర్ఖుల జీవితమునకుఁ గృతార్ధత వేఱుగ నడుగ నేల

“మదకలమదిరాక్షీ నీవిమోక్షోహి మోక్షః

అనుసూత్రము వీరికయ్యే వారియఁబడుట!