ఈ పుట అచ్చుదిద్దబడ్డది

117

నొక నెమలి రంగులపురి విప్పి రమ్యముగ నర్తన మొనరించుచుండె. సెలయేటి తరంగములు మృదు మధుర స్వరములతో మృదంగము వాయించెను. తటాకమున జలపక్షులు ఱెక్కలల్లార్చుచు కర తాళ ధ్వనులు చేసినవి. పచ్చికపై పారణనేయు జింకలును పొదలలో నరనిద్రలోనున్న పులులును హాయిగ నీగానము ననుభవించుచుండెను. తరు లతాదులు ప్రేక్షకులకు ఫలపుష్పముల నుపాయన మర్పించుచుండె! అకటా! స్వార్థపరమగు మానవ ప్రపంచమున నీయానంద మెందుండి వచ్చును! సదయుఁడు చూచి చూచి యుప్పొంగెను, కో- యిలగనో, జింకగనో, తన కపుడు జన్మమబ్బిన చో నెంత సంతసించి యుండునో.

భగవంతునిచే సృష్టింపఁబడిన జీవరాసు లన్నిటిలో మానవుఁడే యెందునకుఁ గొఱమాలిన . నిరర్దక జంతువు. అడవిలోని కౄర జంతువులు గూడ తమ కాహారమయిన మృగములఁ దప్ప నితర మృగముల జోలికిఁబోవు. క్షుద్ర జంతువు- లును తమ భోక్తను దప్ప యితర మృగములను ద్వేషింపవు. మనజుఁడన్ననో స్వభావము చేతనే సర్వజంతువులను ద్వేషించును. ఆనంద మయమగు నీప్రపంచమున నానందము లేనివాఁడు మానవుఁ