98
డదు. పైఁజెప్పిన దుర్గుణము స్త్రీలయందును గాన వచ్చుచున్నయది. ఇందిరయు గమలయు నిరు వురు నేరాండ్రు. ఇందిర మిగుల రూపవతి; ఆమె సౌందర్యమున కెట్టివాఁడును దాసుఁడు గావలసి నదే; కాని కంఠస్వర సారస్యవిషయమున నామె కోకిల పిన్నమ్మ! ఆమె సంగీతము వినువారికి కర్ణ కఠోరముగా నుండును. ఇంక కమలగాన మత్య ద్భుతము. అది ఱాలఁగూడఁ గరగింపఁజాలినది. కాని యామె రూపమున రెండవ కుబ్జయే! ఆమె యాకృతి వికారస్వరూపమునకు నెల్ల! ఇందిర నోరు. దెరువకుండినచో నామె సౌందర్యముఁ బట్టి లోకు లామెను బూజింతురు. కమల మఱుఁగుననున్నచో నామె గానమాకర్ణించి జనులామెను ప్రశంసింతురు. అయిన నేమి: ఇందిర పాడక విడువదు. అందఱ యెదుట నామె యేదేని పాడుచునే యుండును. వినువారికి విసుగెత్తినను, ఇది త్యాగయ్య కృతి యనియు, ఇది వెంకటేశ్వరుని కీర్తన మనియును వర్ణించుచుఁ బాడుచుండును. కమలకున్న యవ కాశ మంతయు నామె యలంకారమునకే చాలదు. నిమిష నిమిషమున - కామె క్రొత్త క్రొత్త వేషము చేయుచుండును. నిలువుటద్దము నెదుట నిలుచుండి యామె గడియగడియకు వస్త్రా