ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi

కుంచుకోవలెనని తోచినది. ప్రకృత వ్యాసకర్తల కంతకంటె స్టీలుయొక్క 'టాట్లరు' అను పద 'మె ఎక్కువ రుచించి వారు దానిని 'వదరుఁబోతు' అని తెలిఁగించుకొనిరి.

కాని నిజముగాఁ బరీక్షించితిమేని 'సాక్షికి' వదరుబో' తనియు, 'వదరుఁబోతునకు 'సాక్షి'య నియు పేళ్ళుండిన స్వరూపౌచిత్య మెక్కునగా నుండి యుండునేమో యని యొక యూహ తోఁచెడిని, ‘వదరుఁబోతు' అనుపదమునందలి నీచార్థమునువదలి 'వాగ్మి' అనునర్థమును మాత్రము గ్రహించితిమేని- అట్లే గ్రహింప వలయును గదా - 'సాక్షి' లో నున్నంత మాటల పాటవము, అడ్డు ఆకలేని నాగుఁబామునడక, సందేహములేని సిద్ధాంతము లు, గరుసుపాఱని గొంతుకతో రచ్చలోనున్న వారికెల్ల వినవచ్చునట్లుగా చేయు రాద్ధాంతములు,- ఇవి ‘వదరుఁబోతు'లోఁ గానరావు. 'సాక్షి' సంఘ మందలి ప్రముఖపాత్రమగు జంఘాలశాస్త్రికి నోరు తప్ప మఱియేమైన నవయవము లుండెనా యను సందేహము చదువరులకుఁ గలిగినను అది సహజ ముగానే తోఁచును. 'వదరుబోతు' మార్గము కొంతవఱకు మృదువైనది. ధ్వని ప్రధానము. ఇరువురును ట్లలో మేటులైనను, 'సాక్షి' తిట్లలోని